షమీ వివాదానికి కారణమిదే..

Hasin Farmhouse May responsible for Shami Controversy - Sakshi

కోల్‌కతా : టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే భార్య హసీన్‌ ఆరోపణలతో షమీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అతని కెరీర్‌ సందిగ్దంలో పడింది. షమీ దంపతులు మధ్య వివాదం చెలరేగడానికి ‘ఫామ్‌ హౌజ్‌ కారణమ’ని వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో షమీ దంపతులకు ‘హసీన్‌ ఫామ్‌ హౌజ్‌’ ఉంది. దాని విలువ సుమారు రూ. 12 కోట్ల నుంచి 15 కోట్లు ఉంటుందని అంచనా. హసీన్‌ పేరుతో ఉన్నా ఈ ఫామ్‌ హౌజ్‌కు సంబంధించిన పత్రాలలో ఆమె పేరు ఎక్కడా లేదని, భవిష్యత్తులో ఇక్కడే షమీ క్రికెట్‌ అకాడమీ నిర్మించాలనుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు మొదలైనట్లు ఓ జాతీయ చానెల్‌ పేర్కొంది.

షమీ మంచివాడే: హసీన్‌ తండ్రి
వివాదంపై స్పందించాలని హసీన్‌ తండ్రిని మీడియా ప్రతినిధులు కోరగా.. ఈ విషయం గురించి తనకు ఏమాత్రం తెలియదన్నారు. షమీ, హసీన్‌లకే అసలు నిజం తెలుసన్నారు. మహ్మద్‌ షమీ ఎలాంటివాడని ప్రశ్నించగా అతడు ఒకప్పుడు మంచివాడేనని సమాధానమిచ్చారు. ఇక తన కూతురు చిన్ననాటి నుంచే ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉండేదని, స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించేదన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top