వారెవ్వా పాండ్యా.. వాటే క్యాచ్‌! | Hardik Pandya Takes A Wonder Catch In 3rd ODI Against New Zealand | Sakshi
Sakshi News home page

Jan 28 2019 9:53 AM | Updated on Jan 28 2019 10:38 AM

Hardik Pandya Takes A Wonder Catch In 3rd ODI Against New Zealand - Sakshi

పాండ్యా ఈజ్‌ బ్యాక్‌.. దటీజ్‌ పాండ్యా.. ఫీల్డింగ్‌కా షేర్‌

మౌంట్‌మాంగనీ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హర్ధిక్‌ పాండ్యా కళ్లుచెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేదానికి గురై భారత జట్టులో స్థానం కోల్పోయిన పాండ్యా.. రీఎంట్రీలో అదరగొట్టాడు. మైమరిపించే ఫీల్డింగ్‌తో మైదానంలోని ఆటగాళ్లను.. అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. చహల్‌ వేసిన 17వ ఓవర్‌ తొలి బంతిని కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ ముందుకొచ్చి షాట్‌ ఆడగా.. ఫార్వార్డ్‌ ఫీల్డింగ్‌ ఉన్న పాండ్యా సూపర్‌ డైవ్‌తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. రెప్పపాటులోనే పాండ్యా సూపర్‌ క్యాచ్‌ అందుకోవడంతో విలియమ్సన్‌(28) నిరాశగా పెవిలియన్‌ చేరాడు. దీంతో కివీస్‌కు పెద్ద దెబ్బపడింది.

తొలి రెండు వికెట్లను త్వరగా కోల్పోయిన కివీస్‌ను.. విలియమ్సన్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ పాండ్యా అద్భుత క్యాచ్‌తో అడ్డుకున్నాడు. ఈ సూపర్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పాండ్యా మద్దతుదారులు, అభిమానులు..‘పాండ్యా ఈజ్‌ బ్యాక్‌.. దటీజ్‌ పాండ్యా.. ఫీల్డింగ్‌కా షేర్‌’ అని కామెంట్‌ చేస్తున్నారు. కాఫీ విత్‌ కరణ్‌ షోలో సోయిమరిచి మాట్లాడిన పాండ్యా, రాహుల్‌పై బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం.. ప్రపంచకప్‌ ముందు ఈ యువ ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ అవసరమనే వాదనలు వినిపించడంతో బీసీసీఐ విచారణను కొనసాగిస్తూనే నిషేధం ఎత్తేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement