హార్దిక్‌ పాండ్యాకు మరో షాక్‌

Hardik Pandya Loses Mumbai Khar Gymkhana Membership - Sakshi

ముంబై : మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలపాలైన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు మరో షాక్‌ తగిలింది. ముంబైలో ప్రతిష్టాత్మక క్లబ్‌ అయిన ‘ఖర్‌ జింఖానా’లో గౌరవ సభ్యత్వాన్ని కోల్పోయాడు. సోమవారం జరిగిన మేనేజింగ్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఖర్‌ జింఖానా సంయుక్త కార్యదర్శి గౌరవ్‌ కాపాడియా వెల్లడించారు. హార్దిక్‌ పాండ్యా సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పష్టం చేశారు.

‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో కేఎల్‌ రాహుల్‌తో పాటు హార్దిక్‌ పాండ్యా వివాదాల్లో చిక్కుకున్నాడు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వీరిపై బీసీసీఐ నిరవధిక సస్పెన్షన్‌ విధించింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని బీసీసీఐ షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా.. పాండ్యా, రాహుల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పారు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top