‘భాజీ.. మీ లుక్‌ అస్సలు బాలేదు’

Harbhajan Hits Out at Twitter User Who Questioned Him For Not Wearing Turban - Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు హర్బజన్‌ సింగ్‌ బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టడమే కాదు.. తనకు ఉచిత సలహాలు ఇచ్చిన వారికి దిమ్మ తిరిగే సమాధానాలు ఇ‍వ్వడంలోనూ దిట్ట. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపించాడు భజ్జీ. విషయమేమిటంటే.. సీఎస్‌కే జట్టుతో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో హర్బజన్‌ క్యాప్‌ ధరించి.. తోటి ఆటగాళ్లతో సరదాగా గడుపుతున్న వీడియో ఒకటి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

దీనికి స్పందించిన ఓ నెటిజన్‌.. ‘భాజీ.. (వయసులో నాకంటే చిన్న వారైనా మీరెంతో  సాధించారు. అందుకే భాజీ అని సంబోధిస్తున్నా) మీ ట్విటర్‌ అకౌంట్‌కు హర్బజన్‌ టర్బోనేటర్‌ అని పేరు పెట్టుకున్నారు కదా. మరి మీరు చిన్న జడతో కూడిన పర్కా (సిక్కులు ధరించే తలపాగా వంటిది) ధరించవచ్చు కదా. అప్పుడే నిజమైన సర్దార్‌లా ఉంటారు. ప్రస్తుతం మీ లుక్‌ విసుగు తెప్పిస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీనికి స్పందనగా హర్బజన్‌.. ‘భాయ్‌ మీ ఇంటి ఙ్ఞానాన్ని నాకు పంచకండి. ఒక సర్దార్‌ ఎలా ఉండాలో మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదం’టూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top