అలా చేస్తే ద్వేషిస్తా: మెక్‌గ్రాత్‌

Glenn McGrath In Favour Of Traditional Five Day Tests - Sakshi

మెల్‌బోర్న్‌: తానొక సంప్రదాయ క్రికెటర్‌నని ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ స్పష్టం చేశాడు. సం‍ప్రదాయ క్రికెటర్‌నైన తాను ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ను మాత్రమే ఇష్టపడతానన్నాడు. టెస్టు మ్యాచ్‌ రోజుల్ని కుదించడం సరైనది కాదన్నాడు. దీనిలో భాగంగా ఐదు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రతిపాదనను ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ వ్యతిరేకించాడు.

‘నేను సంప్రదాయవాదిని. ఇప్పుడున్న టెస్ట్‌ ఫార్మాటే నాకిష్టం. అలా కాకుండా కుదిస్తే మాత్రం ద్వేషిస్తా. పింక్‌ బాల్‌ లాంటి ప్రయోగాల కారణంగా టెస్ట్‌ల ఆదరణ పెరుగుతోంద’ని మెక్‌గ్రాత్‌ చెప్పాడు. తాజా ప్రతిపాదనను ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌, కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ కూడా వ్యతిరేకించారు. అయితే, ఈ విషయమై మాట్లాడడం తొందరపాటే అవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కామెంట్‌ చేశాడు.(ఇక్కడ చదవండి: చివరి ఓవర్‌లో అలా ఆడొద్దు : మెక్‌గ్రాత్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top