అప్పుడు చాలా బాధపడ్డా: రైనా | Glad to get ODI runs after Test failure, says Suresh Raina | Sakshi
Sakshi News home page

అప్పుడు చాలా బాధపడ్డా: రైనా

Jan 19 2015 2:32 PM | Updated on Sep 2 2017 7:55 PM

అప్పుడు చాలా బాధపడ్డా: రైనా

అప్పుడు చాలా బాధపడ్డా: రైనా

వచ్చే నెలలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో తాను ఫామ్ లోకి రావడం పట్ల టీమిండియా బాట్స్ మన్ సురేశ్ రైనా సంతోషం వ్యక్తం చేశాడు.

బ్రిస్బేన్: వచ్చే నెలలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో తాను ఫామ్ లోకి రావడం పట్ల టీమిండియా బాట్స్ మన్ సురేశ్ రైనా సంతోషం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన వన్డేలో రైనా అర్థ సెంచరీ సాధించాడు. అంతముందు ఆసీస్ తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో అతడు ఘోరంగా విఫలమయ్యారు.

రెండేళ్ల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడినందున పరుగులు చేయలేకపోయానని రైనా చెప్పాడు. టెస్టుల్లో విఫలం కావడంతో ఎంతో బాధ పడ్డానని, ఆ సమయంలో జట్టు సభ్యులు తనకు మద్దతుగా నిలిచారని వెల్లడించాడు. మళ్లీ ఫామ్ లోకి రావడానికి కష్టపడ్డానని రైనా తెలిపాడు. ఫామ్ ను కొనసాగిస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement