షూటింగ్‌కు వచ్చే నష్టమేమీ లేదు

Gagan Narang Says Shooting not being part of 2022 CWG - Sakshi

కామన్వెల్త్‌ నుంచి తొలగించడంపై గగన్‌ నారంగ్‌

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి తొలగించి నంత మాత్రాన షూటింగ్‌కు వచ్చే నష్టమేమీ లేదని 2012 లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, షూటర్‌ గగన్‌ నారంగ్‌ అభిప్రాయ పడ్డాడు. 2022లో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి షూటింగ్‌ను తొలగిస్తున్నట్లు కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (సీజీఎఫ్‌) గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత ఒలింపిక్‌ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సోమవారం స్పందించిన గగన్‌ ‘ఇదేమీ షూటింగ్‌కు ఎదురుదెబ్బ కాదు. ఉదాహరణకు క్రికెట్‌నే చూడండి.

అదేమీ ఒలింపిక్స్‌లో లేదు.. అలాగే కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ లేదు. అయినా అది ఎదగలేదా.. అలాగే స్క్వాష్‌ కూడా.. జరిగిందేదో జరిగింది. కామన్వెల్త్‌లో షూటింగ్‌ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి 2022లో జరిగే ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి సారించండి’ అంటూ హితవు పలికాడు. అలాగే భవిష్యత్తులో షూటింగ్‌ తిరిగి కామన్వెల్త్‌ గేమ్స్‌లో రీ ఎంట్రీ ఇస్తుందనే నమ్మకం తనకుందని నారంగ్‌ అన్నాడు.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top