దక్షిణాఫ్రికాకు జరిమానా

దక్షిణాఫ్రికాకు జరిమానా


మెల్‌బోర్న్: భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న దక్షిణాఫ్రికాపై స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా కూడా పడింది. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేశారని రిఫరీ జెఫ్ క్రో తెలిపారు. దీంతో కెప్టెన్ డి విలియర్స్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఆటగాళ్లకు 10 శాతం జరిమానా విధించారు. టోర్నీలో మరో మ్యాచ్‌లో ఈ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే కెప్టెన్‌పై ఓ వన్డే నిషేధం పడుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top