విజయానికి మరో 203 పరుగులు

England Need 203 Runs To Win Third Ashes Test - Sakshi

పోరాడుతున్న ఇంగ్లండ్‌   

యాషెస్‌ మూడో టెస్టు   

లీడ్స్‌: యాషెస్‌ సిరీస్‌ను నిలబెట్టుకునే దిశగా ఆ్రస్టేలియా అడుగులు వేస్తుండగా, ఇంగ్లండ్‌ తీవ్రంగా పోరాడుతోంది. మూడో టెస్టులో 359 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్‌జో రూట్‌ (75 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (2 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ విజయం కోసం మరో 203 పరుగులు చేయాల్సి ఉంది.

ఒక దశలో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను రూట్, డెన్లీ (50; 8 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. డెన్లీని ఔట్‌ చేసి హాజల్‌వుడ్‌ కీలక భాగస్వామ్యాన్ని విడదీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 171/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్‌(80; 8 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్టోక్స్‌కు 3 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి 2–0తో ఆసీస్‌ ఆధిక్యంలోని వెళితే... తర్వాతి రెండు టెస్టులు ఓడినా యాషెస్‌ను నిలబెట్టుకుంటుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top