పరుగుల వరద పారిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ రెండో టెస్టులో నాలుగో రోజు బౌలర్లు పైచేయి సాధించారు.
కేప్‌టౌన్: పరుగుల వరద పారిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ రెండో టెస్టులో నాలుగో రోజు బౌలర్లు పైచేయి సాధించారు. 16/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మ్యాచ్ ముగించే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ కు 161 పరుగుల ఆధిక్యం దక్కింది. వెలుతురు మందగించడంతో ఆటను నిర్ణీత సమయాని కంటే ముందే ముగించారు.
కుక్ 8, హేల్స్ 5, కాంప్టన్ 15, రూట్ 29, టేలర్ 27, స్టోక్స్ 26 పరుగులు చేశారు. బెయిర్ స్టో 30, అలీ 10 పరుగులతో ఆడుతున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో పీడ్ట్ 3 వికెట్లు పడగొట్టాడు. మోర్కల్, రబడా, మోరిస్ తలో వికెట్ దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 627 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ 629/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ డిక్లేర్ చేసింది.