వాన్ గాల్ 'ఎత్తు' మాస్టర్ పీస్ | Dutch Media hails Van Gaal's masterstroke | Sakshi
Sakshi News home page

వాన్ గాల్ 'ఎత్తు' మాస్టర్ పీస్

Jul 7 2014 8:57 AM | Updated on Oct 22 2018 5:58 PM

వాన్ గాల్ 'ఎత్తు' మాస్టర్ పీస్ - Sakshi

వాన్ గాల్ 'ఎత్తు' మాస్టర్ పీస్

షూటౌట్‌లో ‘ఎత్తు’తో కోస్టారికాను చిత్తుచేసిన నెదర్లాండ్స్ ఫుట్బాల్ కోచ్ లూయిస్ వాన్ గాల్ ను డచ్ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది.

హాగ్: షూటౌట్‌లో ‘ఎత్తు’తో కోస్టారికాను చిత్తుచేసిన నెదర్లాండ్స్ ఫుట్బాల్ కోచ్ లూయిస్ వాన్ గాల్ ను డచ్ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. అనూహ్య నిర్ణయంతో జట్టును ఫిఫా ప్రపంచకప్ సెమీస్ ఫైనల్ కు చేర్చిన అతడి వ్యూహచతురతను మీడియా కొనియాడింది. వాన్ గాల్ ది బంగారు పిడికిలి అని డీ టెలిగ్రాఫ్ హెడ్లైన్స్ పేర్కొంది. కొన్నిసార్లు అదృష్టం కలిసొస్తుంది. కొన్నిసార్లు సిక్త్ సెన్స్ నిజమవుతుంది అని తెలిపింది.

వాన్ గాల్ ప్రయోగాన్ని మాస్టర్ పీస్ గా మరో డచ్ పత్రిక వాల్క్స్క్రాంత్ వర్ణించింది. డచ్ టీవీ స్టేషన్ ఎన్ఓఎస్ కూడా 62 ఏళ్ల వాన్ గాల్ వ్యూహాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యాలు చేసింది.

కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎక్‌స్ట్రా సమయం మరికొద్ది క్షణాల్లో ముగుస్తుందనగా నెదర్లాండ్స్ కోచ్ తమ ప్రధాన గోల్ కీపర్ సిల్లెసన్‌ను మార్చి పెనాల్టీ షూటౌట్ కోసం రెండో గోల్ కీపర్ టిమ్ క్రూల్‌ను వాన్ గాల్ బరిలోకి దించాడు. ఎందుకంటే సిల్లెసన్‌ కంటే టిమ్ క్రూల్‌ ఎత్తు ఎక్కువ. కోచ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా టిమ్ క్రూల్‌ రెండు గోల్స్ ను అడ్డుకుని జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో వాన్ గాల్ ప్రయోగానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా, ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ పెనాల్టీ షూటౌట్‌లో నెగ్గడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement