తొలి భారత క్రికెటర్‌గా ధోని..

Dhoni becomes the first Indian to hit 350 sixes in international cricket - Sakshi

బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్‌, పరిమిత ఓవర్ల వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని మరో  అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా ధోని రికార్డు నెలకొల్పాడు.  బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ధోని మూడు సిక్సర్లు బాదాడు. దాంతో 352వ సిక్సర్‌ను ధోని సాధించాడు. ఈ క్రమంలోనే 350 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా ధోని గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్సర్ల మార్కును ధోని చేరాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో ధోని 23 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 40 పరుగులు చేశాడు.
(ఇక్కడ చదవండి: అబ్బా ధోని.. ఏం ఫిట్‌నెస్‌ అయ్యా నీది!)

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాత స్థానంలో రోహిత్‌(349 సిక్సర్లు) ఉన్నాడు. ఇక్కడ ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో క్రిస్‌ గేల్‌(506 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉండగ, షాహిద్‌ ఆఫ్రిది(476 సిక్సర్లు) రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్యతో కలిసి ధోని నాల్గో స్థానంలో ఉన్నాడు.

ఇక్కడ చదవండి: 500 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top