16 ఏళ్ల రికార్డు బద్దలు

Dalilah Muhammad broke the 400m hurdles world record - Sakshi

మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికా అథ్లెట్‌ దలీలా ప్రపంచ రికార్డు  

డెస్‌ మొయినెస్‌ (అమెరికా): రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ దలీలా మొహమ్మద్‌ మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అమెరికాకు చెందిన 29 ఏళ్ల ఈ అథ్లెట్‌ యూఎస్‌ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల మహిళల హర్డిల్స్‌ రేసును 52.20 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో 16 ఏళ్ల క్రితం 2003లో యులియా పెచొంకినా (రష్యా) నెలకొల్పిన 52.34 సెకన్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి బంగారు పతకం చేజిక్కించుకుంది. దోహా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అమెరికా జట్టు ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో దలీలా ఈ ఘనత సాధించింది. అయితే ఈ కొత్త ప్రపంచ రికార్డు విషయం తనకు కోచ్‌ చెబితేగానీ తెలియదని ఆమె చెప్పింది. పురుషుల 200 మీటర్ల పరుగు పందెంలో అమెరికా స్టార్‌ నోవా లైల్స్‌ విజేతగా నిలిచాడు. అతను అందరికంటే ముందు పరుగును 19.78 సెకన్లలో పూర్తి చేయగా... క్రిస్టియాన్‌ కోల్‌మన్‌ (20.02 సెకన్లు) రజతం, అమీర్‌ వెబ్‌ (20.45 సెకన్లు) కాంస్యం గెలుపొందారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top