ఫిఫా ప్రపంచకప్‌: రష్యా కథ ముగిసింది

Croatia Beat Russia To Enter Semi Finals - Sakshi

సెమీస్‌కు క్రొయేషియా

సమరా: ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఫిఫా 2018 వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ సమరంలో ఆతిథ్య జట్టు రష్యా పోరాటం అనూహ్యంగా ముగిసింది. దీంతో ఆ దేశ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం నాలుగో క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆతిథ్య జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 3-4 గోల్స్‌ తేడాతో క్రొయేషియాతో చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్లు రెండేసి గోల్స్‌ చేయడంతో స్కోర్‌ మ్యాచ్‌ డ్రా అయింది. రష్యా తరుపున డెనిస్‌ చెరిషెవ్‌ 31వ నిమిషంలో, మారియో ఫెర్నాండేజ్‌ 115వ నిమిషంలో గోల్స్‌ సాధించారు. క్రొయేషియా తరపున ఆండ్రెజ్‌ 39వ నిమిషంలో, డోమాగ్‌ విడా 100 నిమిషంలో గోల్స్‌ చేశారు.

నాటకీయంగా సాగిన ఈ మ్యాచ్‌లో సమయాన్ని పెంచినా ఫలితం తేలకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఈ షూటౌట్‌లో రష్యా తొలి పెనాల్టీ కిక్‌ను చేజార్చుకోని ఒత్తిడికి లోనైంది. ఇలా రెండు సార్లు పెనాల్టీ షూటౌట్‌ను రష్యా వృథా చేయగా, క్రొయేషియా నాలుగు పెనాల్టీ గోల్స్‌ సాధించడంతో సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది.  ఇక సెమీస్‌లో క్రొయేషియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా క్వార్టర్‌ ఫైనల్లోనే దక్షిణ అమెరికా జట్లకు షాక్‌ తగలడంతో నాలుగు యూరప్‌ జట్లు సెమీస్‌కు చేరాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top