సంధ్యకు స్వర్ణం | Sakshi
Sakshi News home page

సంధ్యకు స్వర్ణం

Published Sun, Jan 6 2019 3:06 AM

 chess championship Vijayawada girl Goli Sandhya was the winner - Sakshi

సాక్షి, విజయవాడ: ఆసియా అమెచ్యూర్‌ ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో విజయవాడ అమ్మాయి గోలి సంధ్య మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో సంధ్య ఆరు పాయింట్లు సాధించింది. ఐదు గేముల్లో గెలిచిన ఆమె, రెండింటిని ‘డ్రా’ చేసుకొని... మరో రెండింటిలో ఓడిపోయింది. జావో యుజువాన్‌ (చైనా) రజతం, సన్‌ ఫురోంగ్‌ (చైనా) కాంస్యం గెలిచారు. ఈ విజయంతో సంధ్య ఈ ఏడాది మెక్సికోలో జరిగే ప్రపంచ అమెచ్యూర్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.    

 
Advertisement
 
Advertisement