పిచ్, అవుట్‌ఫీల్డ్‌ ఓకే | Chennai Test pitch and outfield unaffected by cyclone | Sakshi
Sakshi News home page

పిచ్, అవుట్‌ఫీల్డ్‌ ఓకే

Dec 14 2016 12:48 AM | Updated on Aug 20 2018 9:35 PM

భారత్, ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం నుంచి ఇక్కడ జరగనున్న ఐదో టెస్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందీ లేదని తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) ప్రకటించింది.

చెన్నై: భారత్, ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం నుంచి ఇక్కడ జరగనున్న ఐదో టెస్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందీ లేదని తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) ప్రకటించింది. ‘వర్దా’ తుపాను కారణంగా సోమవారం నగరం మొత్తం తీవ్రంగా దెబ్బతింది. అయితే చిదంబరం స్టేడియంలోని అవుట్‌ఫీల్డ్, పిచ్‌ మాత్రం పాడు కాలేదని టీఎన్‌సీఏ కార్యదర్శి కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు. ‘మైదానంలో సైట్‌ స్క్రీన్‌లు, బల్బ్‌లు, ఎయిర్‌కండిషనర్లు దాదాపు పూర్తిగా చెడిపోయాయి. కానీ వికెట్, గ్రౌండ్‌ను మాత్రం జాగ్రత్తగా సంరక్షించుకున్నాం’ అని ఆయన చెప్పారు. రెండు రోజుల్లోగా ఇతర సమస్యలు కూడా అధిగమించి, అన్ని ఏర్పాట్లతో మ్యాచ్‌ నిర్వహించగలమని విశ్వనాథ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement