ఐసీసీతో బ్రిటానియా ఒప్పందం

Britannia Company Agreement With ICC Cricket World Cup - Sakshi

శతవసంతోత్సవాల సందర్భంగా వినూత్న ప్రచారం

విజేతలకు ప్రపంచకప్‌ నేరుగా చూసే అవకాశం

బెంగళూరు: త్వరలో జరుగనున్న ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఐసీసీతో జతకట్టిన బ్రిటానియా యాజమాన్యం ‘బ్రిటానియా ఖావో... వరల్డ్‌ కప్‌ జావో’ స్లోగన్‌తో క్రికెట్‌ అభిమానులను ఆకర్షించే పనిలో పడింది. దీనిలో భాగంగా అదృష్టవంతులైన 100 మంది అభిమానులకు ఇంగ్లండ్‌లో జరుగనున్న ప్రపంచ కప్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు అయ్యే మొత్తం ఖర్చుల్ని బ్రిటానియా కంపెనీ భరించనుంది. 1999లోనూ ఇదే ఫార్ములాతో బ్రిటానియా ప్రజలకు చేరువైంది. కంపెనీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మళ్లీ ఈ ఏడాది అదే పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.

దీని ప్రచార కార్యక్రమం మంగళవారం బెంగళూరులో జరిగింది. 1989 ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గిన భారత దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి భారత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్, రోజర్‌ బిన్నీ, సయ్యద్‌ కిర్మాణి, శ్రీకాంత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ అరుదైన అవకాశాన్ని పొందాలనుకునే వారు బ్రిటానియా ప్యాకెట్‌పై ఉన్న ప్రోమో కోడ్‌ను అందులో సూచించిన నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాల్సి ఉంటుంది. లక్కీ డ్రాలో ఎంపికైన 100 మంది క్రికెట్‌ అభిమానులు నేరుగా మ్యాచ్‌ చూసే అవకాశాన్ని పొందుతారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top