ప్రిక్వార్టర్స్‌లో బాయ్స్ స్పోర్ట్స్ | boys sports company enters pre quarter final of basket ball tourny | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో బాయ్స్ స్పోర్ట్స్

Aug 19 2016 12:52 PM | Updated on Jul 12 2019 3:37 PM

హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘బి’ జట్టు ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

సాక్షి,  హైదరాబాద్: హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘బి’ జట్టు ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన లీగ్ మ్యాచ్‌లో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ (బీఎస్‌సీ) ‘బి’ జట్టు 51-50తో హైదరాబాద్ వైఎంసీఏ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బీఎస్‌సీ జట్టు తరఫున విఘ్నేశ్ 25 పాయింట్లు, అమన్ 15 పాయింట్లు సాధించారు. హైదరాబాద్ వైఎంసీఏ జట్టులో వినయ్ (22), నరేశ్ (7) పోరాడారు. ఇతర మ్యాచ్‌ల్లో సనత్‌నగర్ క్లబ్ 41-23తో సెయింట్ జోసెఫిన్ క్లబ్‌పై గెలుపొందింది.

 

సనత్‌నగర్ క్లబ్ తరఫున నవీద్ (13), సాయి ప్రకాశ్ (11)... సెయింట్ జోసెఫిన్ క్లబ్ జట్టులో అశుతోష్ (10), దత్త (4) ఆకట్టుకున్నారు. ఎన్‌పీఏ క్లబ్ 43-39తో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘ఎ’ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఎన్‌పీఏ తరఫున మనోజ్ (20), భూపేందర్ (15)... బీఎస్‌సీ ‘ఎ’ జట్టులో ప్రశాంత్ (15), ప్రదీప్ (10) రాణించారు. మరో మ్యాచ్‌లో హూప్‌స్టర్స్ జట్టు 63- 53తో బీహెచ్‌ఈఎల్ ‘ఎ’ జట్టుపై గెలుపొందింది. హూప్‌స్టర్స్ జట్టు తరఫున రామకృష్ణారెడ్డి (23), వెంకటేశ్ (15)... బీహెచ్‌ఈఎల్ ‘ఎ’ జట్టులో చైతు (17), తులసి (12) ప్రతిభ కన బరిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement