
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్‌లో బ్లాక్ హాక్స్ హైదరాబాద్ జట్టు వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. కాలికట్ హీరోస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ 11–15, 11–15, 7–15, 15–12, 15–11తో ఓడిపోయింది. ఈ లీగ్‌లో కాలికట్ హీరోస్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం.
బ్లాక్ హాక్స్ జట్టు స్పైక్‌లో 27 పాయింట్లు, బ్లాకింగ్‌లో ఆరు పాయింట్లు, సర్వీస్‌లో నాలుగు పాయింట్లు సాధించింది. కాలికట్ జట్టు స్పైక్‌లో 36 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. అజిత్ లాల్ 19 పాయింట్లు, జెరోమ్ వినీత్ 12 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో చెన్నై స్పార్టన్స్ ఆడుతుంది.