తెలుగు టైటాన్స్ ఓటమి.. | bengalore bulls in lead in prokabaddi league | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్ ఓటమి..

Aug 21 2015 9:14 PM | Updated on Sep 3 2017 7:52 AM

తెలుగు టైటాన్స్ ఓటమి..

తెలుగు టైటాన్స్ ఓటమి..

ప్రొ కబడ్డీ లీగ్ -2లో బెంగళూరు బుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన తొలి సెమీస్ లో తెలుగు టైటాన్స్పై బెంగళూరు బుల్స్ 39-38 తేడాతో విజయం సాధించింది.

ముంబయి: ప్రొ కబడ్డీ లీగ్ -2లో బెంగళూరు బుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన తొలి సెమీస్ లో తెలుగు టైటాన్స్పై బెంగళూరు బుల్స్ 39-38 తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి 16-10 తేడాతో తెలుగు టైటాన్స్ పై ఆధిక్యంలో ఉన్న బెంగళూరు బుల్స్ రెండో అర్ధభాగంలోనూ జోరు ప్రదర్శించారు. కానీ తెలుగు టైటాన్స్ అనూహ్యంగా పుంజుకోవడంతో ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారు. కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలయ్యారు. మ్యాచ్ చివరి నిమిషాల్లో బెంగళూరు ఆలౌట్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. చివరి రైడ్ కు రాహుల్ రెండు పాయింట్లు తీసుకొస్తే మ్యాచ్ టై అయ్యేది. కానీ, రాహుల్ ఒక్క పాయింట్ తెచ్చాడు. దీంతో టైటాన్స్ ఓటమి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement