ఫిఫా వరల్డ్‌ కప్‌: 48 ఏళ్లలో తొలిజట్టు

Belgium Beat Japan To Reach Quarter Finals - Sakshi

రోస్టోవ్: ఫిఫా వరల్డ్‌ కప్‌లో బెల్జియం సంచలన విజయం సాధించడంతో పాటు కొత్త అధ్యాయాన్ని లిఖించింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌పై  విజయం సాధించిన బెల్జియం క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఇరు జట్ల మధ్య హోరాహోరాగా సాగిన పోరులో అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన బెల్జియం 3-2 తేడాతో జపాన్‌ను చిత్తుచేసింది.

రెండో అర్థ భాగం ఆరంభంలో 2-0తో వెనుకబడిన బెల్జియం.. ఆ తర్వాత అరగంట లోపు మూడు గోల్స్‌ సాధించి జపాన్‌కు షాకిచ్చింది. బెల్జియం ఆటగాళ్లలో జాన్‌ వెర్టోన్‌గెన్‌ గోల్‌ సాధించగా, ఫెల్లానీ రెండు గోల్స్‌ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ చరిత్రలో బెల్జియం క్వార్టర్స్‌కు చేరడం మూడోసారి కాగా, వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ గేమ్‌లో 2-0 వెనుకబడి ఆపై విజయాన్ని అందుకోవడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.

రెండో అర్థ భాగంలో జపాన్‌ స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్‌తో దూసుకుపోయింది. ఆట 48వ నిమిషంలో హరగుచి గోల్‌ సాధించగా, 52వ నిమిషంలో టకాషి ఇనుయ్‌ మరో గోల్‌ సాధించడంతో జపాన్‌ 2-0 ఆధిక్యం లభించింది. దాంతో జపాన్‌కు నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ దక్కాయి. అయితే ఈ ఆనందం వారికి ఎంతో సేపు నిలవలేదు. ఆ తర్వాత బెల్జియం రెచ్చిపోయింది. 70, 75 నిమిషాల్లో గోల్స్‌ సాధించి స్కోరును సమం చేసింది.  తొలుత వెర్టోన్‌గెన్‌ గోల్‌ సాధించగా, ఐదు నిమిషాల వ్యవధిలో ఫెల్లానీ మరో గోల్స్‌ సాధించాడు. ఆపై నిర్ణీత సమయం వరకూ ఇరు జట్లు గోల్‌ సాధించడం కోసం తీవ్రంగా శ్రమించాయి. కాగా, అదనపు సమయంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన బెల్జియం ఆటగాడు చాడ్లి గోల్‌ సాధించి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.  శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌తో బెల‍్జియం తలపడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top