రిటైర్మెంట్ గురించి మాస్టర్తో చర్చించలేదు: బోర్డు | BCCI not asked Sachin Tendulkar to retire | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ గురించి మాస్టర్తో చర్చించలేదు: బోర్డు

Oct 3 2013 5:17 PM | Updated on Sep 1 2017 11:18 PM

రిటైర్మెంట్ గురించి మాస్టర్తో చర్చించలేదు: బోర్డు

రిటైర్మెంట్ గురించి మాస్టర్తో చర్చించలేదు: బోర్డు

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ తన చరిత్రాత్మక 200వ టెస్టు అనంతరం రిటైరవ్వాల్సిందిగా సూచించలేదని బీసీసీఐ స్సష్టం చేసింది. సచిన్కు ఈ మేరకు సంకేతాలు పంపినట్టు వచ్చిన వార్తలను బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ గురువారం తోసిపుచ్చారు.

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ తన చరిత్రాత్మక 200వ టెస్టు అనంతరం రిటైరవ్వాల్సిందిగా సూచించలేదని బీసీసీఐ స్సష్టం చేసింది. సచిన్కు ఈ మేరకు సంకేతాలు పంపినట్టు వచ్చిన వార్తలను బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ గురువారం తోసిపుచ్చారు. రిటైర్మెంట్ విషయం గురించి బోర్డు మాస్టర్తో ఎప్పుడూ చర్చించలేదని తెలిపారు. ఈ అంశం అతని నిర్ణయానికే వదిలేసినట్టు చెప్పారు.

సచిన్ గొప్ప క్రికెటరని, రిటైర్మెంట్ నిర్ణయం అతనితో పాటు సెలెక్టర్లకు సంబందించిన విషయమని పటేల్ అన్నాడు. దీనికి సంబంధించి మాస్టర్ ఏ నిర్ణయం తీసుకున్నా బోర్డుకు సమ్మతమేనని పేర్కొన్నారు. మాస్టర్ రికార్డు టెస్టు మ్యాచ్ ఆడిన అనంతరం వీడ్కోలు చెబితే మంచిదని కొందరు బోర్డు సభ్యులు అభిప్రాయపడినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో పైవిధంగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచురించవద్దని మీడియాకు సూచించారు. కాగా వెస్టిండీస్తో జరగనున్న టెస్టు సిరీస్లో సచిన్ రికార్డు టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement