జాతీయ షూటింగ్‌ జట్టులో ఆయుశ్, అబిద్‌

Ayush And Abid In National Shooting Team For Asian Championship - Sakshi

ఆసియా చాంపియన్‌షిప్‌కు జట్టు ప్రకటన  

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు తెలంగాణకు చెందిన ఆరుగురు షూటర్లు ఎంపికైనట్లు తెలంగాణ రైఫిల్‌ సంఘం అధ్యక్షుడు అమిత్‌ సంఘి శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. క్లే పీజియన్‌ ట్రాప్‌ పురుషుల విభాగంలో కైనన్‌ షెనాయ్, క్లే పీజియన్‌ స్కీట్‌ జూనియర్‌ పురుషుల కేటగిరీలో ఆయుశ్‌ రుద్రరాజు, 50మీ. రైఫిల్‌ ప్రోన్‌ పురుషుల విభాగంలో గగన్‌ నారంగ్, 50మీ. రైఫిల్‌ ప్రోన్‌ జూనియర్‌ పురుషుల విభాగంలో అబిద్‌ అలీఖాన్, 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ పురుషుల కేటగిరీలో మాస్టర్‌ ధనుశ్‌ శ్రీకాంత్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ జూనియర్‌ మహిళల విభాగంలో ఇషా సింగ్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దోహాలోని ఖతర్‌ వేదికగా నవంబర్‌లో ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top