రాణించిన స్మిత్, లబ్‌షేన్‌ | Sakshi
Sakshi News home page

రాణించిన స్మిత్, లబ్‌షేన్‌

Published Fri, Dec 27 2019 1:33 AM

Australia vs New Zealand Boxing Day Test Day One  - Sakshi

మెల్‌బోర్న్‌: న్యూజిలాండ్‌తో మొదలైన ‘బాక్సింగ్‌ డే’ టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ (192 బంతుల్లో 77 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా, మార్నస్‌ లబ్‌షేన్‌ (149 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఈ ఏడాది తన జోరును కొనసాగించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. అంతకు ముందు టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే జో బర్న్స్‌ (0)ను బౌల్ట్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత లబ్‌షేన్‌, వార్నర్‌ (41) కలిసి జట్టును ఆదుకోగా, మరో బ్యాట్స్‌మన్‌ మాథ్యూ వేడ్‌ (38) కూడా ఫర్వాలేదనిపించాడు.   

రికార్డు ప్రేక్షకులు...
టెస్టు మ్యాచ్‌ తొలి రోజు భారీ సంఖ్యలో అభిమానులు ఎంసీజీలో హాజరు కావడం విశేషం. గురువారం ఏకంగా 80, 473 మంది ప్రేక్షకులు మ్యాచ్‌ చూసేందుకు వచ్చారు. ‘యాషెస్‌’ సిరీస్‌ కాకుండా ఇతర జట్టు ఆడిన బాక్సింగ్‌ డే టెస్టులో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం 1975 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 1975లో ఆసీస్‌–విండీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఒకే రోజు 85, 661 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement