ఫైనల్లో అపురూప్‌ రెడ్డి జోడీ | Apuroop Reddy Pair in Final of AITA Tournament | Sakshi
Sakshi News home page

ఫైనల్లో అపురూప్‌ రెడ్డి జోడీ

Mar 15 2019 10:09 AM | Updated on Mar 15 2019 10:09 AM

Apuroop Reddy Pair in Final of AITA Tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం పురుషుల టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు పి. అపురూప్‌ రెడ్డి నిలకడగా రాణిస్తున్నాడు. తన భాగస్వామి బీఆర్‌ నిక్షేప్‌తో కలిసి అపురూప్‌ రెడ్డి డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీస్‌ మ్యాచ్‌లో పి.అపురూప్‌ రెడ్డి–నిక్షేప్‌ ద్వయం 6–1, 6–3తో ఆకాశ్‌ నంద్వాల్‌–ఉదిత్‌ యాదవ్‌ జంటపై గెలుపొందింది.

అంతకుముందు క్వార్టర్స్‌లో అపురూప్‌–నిక్షేప్‌ జంట 6–0, 6–1తో సందీప్‌ యాదవ్‌–హ్రితేశ్‌ పటేల్‌ జోడీని ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో తాహా కపాడియా–పరీక్షిత్‌ సోమని జంటతో అపురూప్‌ జోడీ తలపడుతుంది. అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ గత మూడేళ్లుగా అపురూప్‌ రెడ్డికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement