ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు ఆండీ ముర్రే దూరం  | Andy Murray will miss the Australian Open with ongoing hip injury | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు ఆండీ ముర్రే దూరం 

Jan 5 2018 12:49 AM | Updated on Jan 5 2018 12:49 AM

Andy Murray will miss the Australian Open with ongoing hip injury  - Sakshi

టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఆండీ ముర్రే వైదొలిగాడు. తుంటి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో తానీ నిర్ణయం తీసుకున్నానని ముర్రే తెలిపాడు.

30 ఏళ్ల ఈ బ్రిటన్‌ స్టార్‌ ఐదుసార్లు (2010, 2011, 2013, 2015, 2016) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నా ఐదుసార్లూ రన్నరప్‌ ట్రోఫీతోనే సరిపెట్టుకున్నాడు. మణికట్టు గాయం కారణంగా జపాన్‌ స్టార్‌ నిషికోరి కూడా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement