బ్యాట్స్‌మెన్ బాధ్యతతో ఆడితే... ఈ రంజీ సీజన్‌లో ఆంధ్ర జట్టు బుధవారం తొలి విజయాన్ని నమోదు చేసుకుంటుంది.
విజయనగరం: బ్యాట్స్‌మెన్ బాధ్యతతో ఆడితే... ఈ రంజీ సీజన్‌లో ఆంధ్ర జట్టు బుధవారం తొలి విజయాన్ని నమోదు చేసుకుంటుంది. కేరళతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మూడో రోజు మంగళవారం ఆంధ్ర బౌలర్ల ధాటికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకే కుప్పకూలింది. విజయ్ కుమార్ 33 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి కేరళ పతకాన్ని శాసించాడు. స్టీఫెన్ (2/52), అయ్యప్ప (2/8) కూడా బంతితో రాణించారు.
అనంతరం 218 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. భరత్ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 బ్యాటింగ్), ప్రశాంత్ (21 బంతుల్లో ఫోర్‌తో 13 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఆట చివరి రోజు విజయానికి ఆంధ్ర 163 పరుగులు చేయాలి. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు... ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 141 పరుగులకు ఆలౌటైంది.