అగస్త్య పసిడి గురి | All India Shooting Tourney Agastya Eye On Gold | Sakshi
Sakshi News home page

అగస్త్య పసిడి గురి

Oct 2 2019 10:13 AM | Updated on Oct 2 2019 10:13 AM

All India Shooting Tourney Agastya Eye On Gold - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా జీవీ మావలంకార్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర షూటర్‌ కె. అగస్త్య సాయికుమార్‌ సత్తా చాటాడు. గుజరాత్‌లోని ఖాన్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ (టీఆర్‌ఏ)కు ప్రాతినిధ్యం వహించిన అగస్త్య, 50మీ. పురుషుల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో చాంపియన్‌గా నిలిచాడు. అతను ఫైనల్లో 567 పాయింట్లు స్కోర్‌ చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

తొలుత నీలింగ్‌ పొజిషన్‌లో 183 పాయింట్లు స్కోర్‌ చేసిన అగస్త్య ప్రోన్‌ కేటగిరీలో 197 పాయింట్లు సాధించాడు. చివరగా స్టాండింగ్‌ పొజిషన్‌లో 187 పాయింట్లను స్కోర్‌ చేసి విజేతగా నిలిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంస్కార్‌ హవి ల్లా 560 పాయింట్లతో రజత పతకాన్ని దక్కించుకోగా... పంజాబ్‌ షూటర్‌ పంకజ్‌ ముఖీజా 558 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా టీఆర్‌ఏ అధ్యక్షుడు అమిత్‌ సంఘీ జాతీయ స్థాయిలో చాంపియన్‌గా నిలిచిన అగస్త్యను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement