
అధిబన్‌కు రజతం
ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ బి.అధిబన్ రజతం దక్కించుకున్నాడు. దీంతో పాటు వచ్చే ఏడాది అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగే ప్రపంచ చెస్ కప్‌కూ అర్హత సాధించాడు.
ప్రపంచ చెస్ కప్‌కు అర్హత
షార్జా: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ బి.అధిబన్ రజతం దక్కించుకున్నాడు. దీంతో పాటు వచ్చే ఏడాది అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగే ప్రపంచ చెస్ కప్‌కూ అర్హత సాధించాడు. అధిబన్‌తోపాటు మరో ముగ్గురు 6.5 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా అధిబన్‌కు రెండో ర్యాంక్‌తోపాటు రజతం దక్కింది. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో యు యాంగ్యీ (చైనా)తో తలపడిన అధిబన్ 33వ ఎత్తు వద్ద డ్రాకు అంగీకరించారు.
దీంతో ఏడు పాయింట్లతో యు యాంగ్యి స్వర్ణం సాధించగా... 6.5 పాయింట్లతో అధిబన్ రెండో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి ఎస్‌పీ సేతురామన్, పరిమార్జన్ నేగి వరుసగా తొమ్మిది, పదో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు 4.5 పాయింట్లతో 36వ ర్యాంక్‌లో నిలిచాడు.