యూఎస్ ఓపెన్ రెండోరౌండ్ లో సోమ్దేవ్ | 2013 US Open: Somdev Devvarman outlasts Lukas Lacko in five sets | Sakshi
Sakshi News home page

యూఎస్ ఓపెన్ రెండోరౌండ్ లో సోమ్దేవ్

Published Thu, Aug 29 2013 10:25 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

యూఎస్ ఓపెన్ రెండోరౌండ్ లో సోమ్దేవ్ - Sakshi

యూఎస్ ఓపెన్ రెండోరౌండ్ లో సోమ్దేవ్

యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో భారతీయ ఆటగాడు సోమదేవ్ వర్మన్ రెండో రౌండ్ లో విజయం సాధించాడు.

న్యూయార్క్ : యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో భారత ఆటగాడు సోమదేవ్ వర్మన్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో 4-6, 6-1, 6-2,4-6,6-4 స్కోరుతో స్లొవాక్ ఆటగాడు లుకాస్ లాకోపై సోమ్‌దేవ్‌ వర్మన్‌ విజయం సాధించి  రెండో రౌండ్ లో అడుగుపెట్టాడు.

ఫస్ట్‌ సెట్‌లో ఓడిన సోమ్‌దేవ్‌ ఆ తర్వాత ఎదురు దాడికి దిగడంతో 84వ ర్యాంక్‌ లూకాస్‌ చేతులెత్తేశాడు. కీలకమైన మూడో సెట్‌లో అదే జోరుతో ఆడి 5-2 లీడ్‌కు దూసుకెళ్లిన సోమ్‌దేవ్‌ గంటా 41 నిమిషాల్లో జయభేరి మోగించాడు. ఇక  26వ సీడ్ ఇటాలియన్ ఆటగాడు అండ్రియస్ శెట్టితో సోమ్దేవ్ ఢీకొననున్నాడు.

ఇక అమెరికాలో స్థిరపడిన భారత ఆటగాడు రాజీవ్ రామ్ 6-1,6-2 స్కోర్తో 16వ సీడ్ శాబియో ఫోగ్నిపై గెలుపొందాడు. ఇక యాండీ ముర్రే 6-2,6-4,6-3 స్కోరుతో మైకేల్ లోద్రాపై పైచేయి సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement