18న హాకీ అంపైర్స్ పరీక్ష | 18 on the Hockey Umpires test | Sakshi
Sakshi News home page

18న హాకీ అంపైర్స్ పరీక్ష

Aug 9 2013 12:42 AM | Updated on Jul 11 2019 5:12 PM

హాకీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 18న హాకీ అంపైర్స్ పరీక్ష జరుగుతుంది. 18 నుంచి 27 ఏళ్ల వయస్సు లోపున్న హైదరాబాద్ జిల్లా పరిధిలోని క్రీడాకారులు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు అర్హులని హెచ్‌హెచ్ తెలిపింది.

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హాకీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 18న హాకీ అంపైర్స్ పరీక్ష జరుగుతుంది. 18 నుంచి 27 ఏళ్ల వయస్సు లోపున్న హైదరాబాద్ జిల్లా పరిధిలోని క్రీడాకారులు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు అర్హులని హెచ్‌హెచ్ తెలిపింది.
 
 అభ్యర్థికి జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలని, వేదిక ఎక్కడనేది వారికి ఎస్సెమ్మెస్ చేయడం జరుగుతుందని పేర్కొంది. అంతర్జాతీయ ఎఫ్‌ఐహెచ్ అంపైర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో పాల్గొనే ఆసక్తి గల వారు  తమ పేర్ల నమోదు కోసం డి.వేణుగోపాల్(98498-25979) లేదా, ఈ.ఎస్.సంజీవ్ కుమార్(99896-21121)లను సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement