100 డాలర్లకే జట్టును కొన్నా! | 100 dollars team purchased :- CPL franchises Vijay Mallya | Sakshi
Sakshi News home page

100 డాలర్లకే జట్టును కొన్నా!

Apr 12 2016 1:15 AM | Updated on Aug 13 2018 8:10 PM

ఆర్థిక వివాదాల్లో చిక్కుకుని విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ఆ మధ్య కరీబియన్ ప్రీమియర్ టి20 లీగ్ (సీపీఎల్)లో ఓ జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

సీపీఎల్ ఫ్రాంచైజీపై విజయ్ మాల్యా

న్యూఢిల్లీ: ఆర్థిక వివాదాల్లో చిక్కుకుని విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ఆ మధ్య కరీబియన్ ప్రీమియర్ టి20 లీగ్ (సీపీఎల్)లో ఓ జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత ఫిబ్రవరిలో బార్బడోస్ ట్రిడెంట్స్‌ను కేవలం 100 డాలర్ల (రూ.6,600)కే తీసుకున్నట్టు తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘సీపీఎల్‌లో జట్టును కొనుగోలు చేసినప్పటి నుంచి నాపై ఓ రకమైన ప్రచారానికి దిగుతున్నారు. ఆ జట్టు కొనుగోలు అనేది వాటాలు తీసుకోవడం ద్వారా జరిగింది.

అయితే దీని కోసం ఓ వంద డాలర్ల ఖర్చు జరిగింది. అయితే కచ్చితంగా టోర్నీలో ఆడాల్సిందిగా మా నుంచి హామీ తీసుకున్నారు. నిజానికి ఫ్రాంచైజీ నిర్వహణకు 2 మిలియన్ డాలర్ల (రూ.13 కోట్లు) వరకు కావాల్సి ఉంటుంది. అందుకే బార్బడోస్ ప్రభుత్వ సహాయం తీసుకున్నాం. వారు మా జట్టుకు సబ్సిడీ మంజూరు చేశారు’ అని మాల్యా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement