
‘ఫ్లిప్ ది స్విఛ్’’ ఛాలెంజ్ దృశ్యాలు
ప్రముఖ సెలబ్రెటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనటంతో...
టిక్‌టాక్‌లో ఇప్పుడు ఓ ఛాలెంజ్ హవా నడుస్తోంది. ‘ఫ్లిప్ ది స్విఛ్’ అనే ఈ ఛాలెంజ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ప్రముఖ సెలబ్రెటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనటంతో బాగా పాపులర్ అయింది. గాయని, నటి జెన్నీఫర్ లోపెజ్, సెనేటర్ ఎలెజెబెత్, నటి సమీరారెడ్డి, కమెడియన్ కేట్ మెక్‌కిన్నాన్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. జెన్నిఫర్ లోపెజ్, అలెక్స్ రోడ్రిగేజ్‌తో కలిసి చేసిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. దాదాపు 42మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. సెనెటర్ ఎలెజెబెత్, కేట్ మెక్‌కిన్నాన్‌ల ఛాలెంజ్ వీడియో ట్విటర్ ఉంచిన కొన్ని గంటలకే 22మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
అత్తతో కలిసి ‘ఫ్లిప్ ది స్విఛ్’’ ఛాలెంజ్ చేస్తున్న నటి సమీరా రెడ్డి
‘ఫ్లిప్ ది స్విఛ్’’ ఛాలెంజ్ కోసం ఇద్దరు వ్యక్తులు అవసరం. ఆ ఇద్దరూ వ్యక్తులు అద్దం ముందు నిల్చుంటారు. అద్దానికి దగ్గరగా ఒకరు సెల్‌ఫోన్ పట్టుకుని నిల్చుని ఉంటే.. మరొకరు వారి వెనకాల డ్యాన్స్ చేస్తుంటారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తమ ప్లేస్‌లను మార్చుకుంటారు. ప్లేసులతో పాటు బట్టలు కూడా మార్చుకుంటారు. ఇదివరకు అద్దం ముందు సెల్‌ఫోన్ పట్టుకుని నిలబడ్డ వ్యక్తి డ్యాన్స్ చేస్తే.. డ్యాన్స్ చేసిన వ్యక్తి అద్దం ముందు నిలబడతాడు. ఈ ఛాలెంజ్‌ను బెల్లా, డాలిన్ రాంబర్ట్ అనే వారు మొదలు పెట్టారు. ఆ తర్వాత దీన్ని వేల మంది ఫాలో అయ్యారు. వారిలో సినీ, రాజకీయ, సోషల్‌మీడియా ప్రముఖలు ఉన్నారు. కాగా, కొద్దిరోజుల కిత్రం నటి సమీరారెడ్డి అత్తతో కలిసి ఈ ఛాలెంజ్‌ను చేశారు.