‘విపక్ష నేతల భద్రతపై బాబు సర్కార్‌ నిర్లక్ష్యం’ | YSRCP MLA Rajanna Dora Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Sep 27 2018 11:35 AM | Updated on Sep 27 2018 1:29 PM

YSRCP MLA Rajanna Dora Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయనగరం : విపక్ష నేతల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. గిరిజన ప్రాంతంలోని ఎమ్మెల్యేలకు నలుగురు గన్‌ మెన్‌లను కేటాయించాల్సి ఉండగా తనకు ఇద్దరిని మాత్రమే కేటాయించారని ఆరోపించారు. చంద్రబాబు విజయనగరం జిల్లాకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. విషజ్వరాలతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

వైస్సార్‌సీపీలోని భారీ చేరికలు
ఎమ్మెల్యే రాజన్న దొర ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వైఎస్‌ జగన్‌ సమక్షంలో మాజీ జడ్పీటీసీ రెడ్డి తిరుపతి నాయడుతోపాటు 45మంది మండల స్థాయి నాయకులు పార్టీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement