శివాజీ ప్యాకేజీ స్టార్‌ : నందిగం సురేష్‌

YSRCP Leader Nandigam Suresh Slams Film Actor Shivaji - Sakshi

సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు ఎంగిలి మెతుకులను ఆశపడి సినీ నటుడు శివాజీ టీడీపీకీ అనుకూలంగా మాట్లాడుతున్నారని బాపట్ల పార్లమెంట్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి నందిగం సురేష్‌ ఆరోపించారు. ప్యాకేజీ స్టార్‌గా మారి చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతూ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హోదారాకుండా చంద్రబాబునాశనం చేశాడని మాట్లాడిన శివాజీ ఇప్పుడు ఎందుకు అనుకూలంగా మట్లాడుతున్నారో చెప్పాలన్నారు. సినిమాలు లేని శివాజీ, చందాలు వసూలు చేసేవాడిలా న్యూస్‌ ఛానెళ్ల ఆఫీసుల చుట్టు తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

శివాజీకి సాయంత్రం ప్యాకేజి ఇస్తే పొద్దున్నే వారి తరపున వకాల్తా పుచ్చుకుని బయల్దేరతారని ఆరోపించారు. వైఎస్‌. జగన్‌పై ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా, కులగజ్జి ఎల్లోమీడియాను ప్రజలు నమ్మేపరిస్దితి లేదన్నారు. ఐదేళ్లుగా రాష్ట్ర సంపదను చంద్రబాబు దోచుకుతిన్నారని ఆరోపించారు. రాజధాని భూముల విషయంలో చంద్రబాబు మోసం చేశారని, దినిపై  చర్చకు తాను సిద్దమన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికల అవుతాయన్నారు. ప్రజలకు ఇచ్చే తీర్పుతో చంద్రబాబు సింగపూర్‌ పారిపోయే పరిస్థితి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top