‘నువ్వు.. నీ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది’

YSRCP Leader Merugu Nagarjuna Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. నువ్వు.. నీ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందంటూ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసినా ఆయన రథ చక్రాలు ఊడిపోతాయంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పలాయనం చిత్తగించాలని, ఆయన కుయుక్తులు ఇక సాగవని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతిసారి ఇక్కడ తప్పు చేసి ఢిల్లీ వెళ్తారని, వ్యవస్థలని మేనేజ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు మరికొందరిపై దాడులు జరిగినా చంద్రబాబు నోరు మెదపలేదని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఢిల్లీ వెళ్లి నీతులు చెప్తున్నారంటూ విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఆయన జయంతి జరపాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. రేపు అంబేద్కర్ జయంతి ఊరువాడ ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top