
ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
సాక్షి, తిరుపతి: ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై చిత్తశుద్ధి ఉంటే ఎంపాలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుందని, అందుకే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని మండిపడ్డారు.