
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు చేసేది ధర్మ పోరాట దీక్ష కాదు.. దొంగ దీక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బాబు నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు నాటకాలాడుతున్నారని భూమన మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తుంటే.. బాబు మాత్రం ఉద్యమకారులను అరెస్టు చేయిస్తున్నారన్నారు.
వంగవీటీ రాధా, ఐఏఎస్ రాఘవేంద్రరావు హత్యల వెనుక చంద్రబాబు హస్తం ఉన్నది నిజం కాదా.? వైఎస్ రాజారెడ్డిని హతమార్చిన నిందితులను చంద్రబాబు తన ఇంట్లో 20 రోజులపాటు ఉంచుకున్నది నిజం కాదా.? అని భూమన ప్రశ్నించారు. చంద్రబాబుకి దమ్ముంటే తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించుకోవాలని సవాల్ విసిరారు.