294వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan 294th Day Praja Sankalpa Yatra Started | Sakshi
Sakshi News home page

Oct 25 2018 8:24 AM | Updated on Oct 25 2018 9:48 AM

YS Jagan 294th Day Praja Sankalpa Yatra Started - Sakshi

సాక్షి, సాలూరు (విజయనగరం) : రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 294వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం మక్కువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పేకపాడు వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది.

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లోని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement