ఎమ్మెల్యేలకు యడ్డి ఆఫర్‌? | yeddyurappa offer for MLAs? | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలకు యడ్డి ఆఫర్‌?

May 20 2018 6:58 AM | Updated on May 20 2018 6:58 AM

yeddyurappa offer for MLAs? - Sakshi

సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు మంత్రి పదవి ఆశ చూపించి ప్రలోభాలకు గురి  చేశారని ఆరోపిస్తూ  కాంగ్రెస్‌ ఆడియో టేపు విడుదల చేసింది. కొచ్చికి వెళ్లవద్దని, తనపై నమ్మకం లేదా అంటూ యడ్యూరప్ప అందులో మాట్లాడారు. బీజేపీకి మద్దతిస్తే తనకొచ్చే లాభం ఏమిటని పాటిల్‌ ప్రశ్నిస్తూ, తనతో పాటు మరో ముగ్గురు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వారిని కూడా తీసుకు రమ్మని యడ్యూరప్ప కోరారు.

 కాంగ్రెస్‌ నుంచి బయటకు వస్తే మంత్రి పదవి ఇస్తానని, ఒక్కసారి కొచ్చికి వెళితే తిరిగి రావడం కుదరదని యడ్యూరప్ప చెబుతారు. మంత్రి పదవితో పాటు ఏ సహాయం కావాలన్నా చేసి పెడతామని హామీ ఇచ్చారు. యడ్యురప్ప కుమారుడు విజయేంద్ర కూడా తమ ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు డబ్బు, మంత్రి పదవి ఆశ చూపించారని కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఈ మేరకు విజయేంద్ర మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపులను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement