ఆ 40 లక్షల అక్రమ వలసదారులేరి?

Where Are 40 Lakh Immigrants, Digvijaya Singh Questions Amit Shah - Sakshi

ఇండోర్‌: అసోంలో దాదాపు 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గతంలో పలుసార్లు చెప్పారని, ఆ 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఎక్కడ ఉన్నారో చెప్పాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల అసోంలో జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో మొత్తం 19 లక్షలమందికి భారతీయ పౌరసత్వానికి సంబంధించిన సరైన పత్రాలు లేవని ఎన్నార్సీ తేల్చింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై దిగ్విజయ్‌ ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ ప్రచారం చేస్తోందని, అసోంలోని 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఎక్కడున్నారో అమిత్‌ షా లేదా ఆయన నంబర్‌ టు కైలాశ్‌ విజయ్‌వార్గియా చెప్పాలని డిమాండ్‌ చేశారు. మతం పేరిట రాజకీయాలు చేస్తూ దేశంలో సందేహాలు రేకెత్తించడం బీజేపీకి పాత అలవాటేనని దిగ్విజయ్‌ ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top