ఆ మనిషి మారడంతే : విజయసాయిరెడ్డి | Vijayasai Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఆ నాలుక ఎప్పుడు ఏ లైన్‌ తీసుకుంటుందో..

May 5 2020 8:00 PM | Updated on May 5 2020 8:11 PM

Vijayasai Reddy Slams Chandrababu Naidu - Sakshi

షాపులెలా తగ్గిస్తారని నిన్నటికి నిన్న కిందపడి దొర్లాడు

సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్వీటర్‌ వేదికగా  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో మద్యం షాపులు ఎలా తగ్గిస్తారని గతంలో గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడేమో కేంద్రం నిర్ణయం మేరకు లిక్కర్‌ షాపులు తెరిస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. (చదవండి : బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా?)

‘రెండు నాలుకల్లో ఏది,ఎప్పుడు,ఏలైన్ తీసుకుంటుందో ఊహించడం కష్టం. కష్టజీవులకు ఉపశమనం లేకుండా మద్య నియంత్రణ ఏంటి? షాపులెలా తగ్గిస్తారని నిన్నటికి నిన్న కిందపడి దొర్లాడు. సైకిల్ నేతలను దెబ్బకొట్టడానికే ఇదంతా అన్నాడు. ఇప్పుడు కేంద్రం నిర్ణయానికి రాష్ట్రాన్ని నిందిస్తున్నాడు.మనిషి మారడంతే!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement