వెంకయ్య విందుకు కాంగ్రెస్‌ గైర్హాజరు

Venkaiah Naidu Called For Breakfast Congress Boycott - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం ఇవ్వనున్న అల్పాహార విందుకు కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు గైర్హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి, జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ గురువారం ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు పార్లమెంట్‌ సభ్యులకు మర్యాద పూర్వకంగా ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు హాజరుకావట్లేదని ఓ సీనియర్‌ నేత ప్రకటించారు.

రఫెల్‌ ఒప్పందం, ఎస్సీ, ఎస్టీ చట్టంపై తమ సభ్యులకు రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, వెంకయ్య నాయుడు సభను ఏకపక్షంగా నడుపుతున్నారని  కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతల నిర్ణయంపై వెంకయ్య నాయుడు తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top