తన గొయ్యి తానే తవ్వుకున్నాడు : ఉత్తమ్‌

Uttam Kumar Reddy Comments On Assembly Dissolution - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నియంతృత్వ, నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్‌... సరైన కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేశారని మండిపడ్డారు. గడువు ముగియకముందే అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) అధినేత కె. చంద్రశేఖర్‌ రావు తన గొయ్యి తానే తవ్వుకున్నారని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగానే ఉందని, తాము క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top