బీజేపీలో చేరికపై టీడీపీ నేతల మంతనాలు | TTDP leaders interested to Join BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరికపై కేంద్రమంత్రితో టీడీపీ నేతల మంతనాలు

May 31 2019 1:04 PM | Updated on May 31 2019 1:24 PM

TTDP leaders interested to Join BJP - Sakshi

కేంద్రంలో, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరేందుకు టీడీపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు.

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ఎక్కువగా ఆసక్తిచూపుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో నాలుగు ఎంపీ సీట్ల గెలుపుతో తెలంగాణలో బీజేపీకి ఒక్కసారిగా అవకాశాలు పెరిగాయి. ఢిల్లీలో తెలంగాణ టీడీపీ నేతలు ఈ.పెద్దిరెడ్డి, చాడా సురేశ్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. బీజేపీలో చేరడంపై కిషన్ రెడ్డితో మంతనాలు జరిపారు.

ప్రస్తుతం తెలుగుదేశం సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా పెద్దిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షడిగా మాజీ ఎంపీ చాడా సురేశ్ రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిణామాల నేపథ్యంలో  కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో కూడా పార్టీ పుంజుకుంటుండటంతో టీటీడీపీ నేతలు ఎక్కువగా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement