ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరిన కవిత

TRS MP Candidate Kavitha Fires Election Campaign At jagtial Korutla - Sakshi

సాక్షి, జగిత్యాల : ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే పార్టీలను నమ్మకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకులను గెలిపించండని టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కవిత ప్రజలను కోరారు. బుధవారం కోరుట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. తెలంగాణలో కేసీఆర్‌ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను గెలిపించారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే ఏలాంటి అభివృద్ధి జరగదని పేర్కొన్నారు. కేంద్రంలో మార్పు రావాలంటే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లు గెలవాలని స్పష్టం చేశారు. కేసీఆర్‌ భోళాశంకురుడు..ఏదడిగితే అది వెంటనే అమలు చేస్తారని పేర్కొన్నారు.

దేశంలో కులవృత్తులకు పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. ​సబ్బండ వర్ణాలు అభివృద్ధే కేసీఆర్‌ లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చే రెండేళ్లలో ఇల్లు లేని ప్రతిఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత టీఆర్‌ఎస్‌దని హామీ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top