'కే వైరస్‌ బాధితులే చంద్రబాబుకు సహకరిస్తున్నారు'

TJR Sudhakarbabu Comments On Chandrababui Naidu - Sakshi

సాక్షి, అమరావతి: కే వైరస్‌ సోకిన వ్యక్తులు చంద్రబాబుకు సహకరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోవడం ప్రజాస్వామ్యానికి విపత్తు అన్నారు. అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబు నైజమన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. 'స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం ఒక విపత్తుగా భావిస్తున్నాం. ఇది కే వైరస్‌. ఈ వైరస్‌ సోకి 40 ఏళ్లు దాటింది. ఈ వైరస్‌ను ఎన్టీఆర్‌పై రుద్దాలని చూశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబు నైజం. కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశారు. కే వైరస్‌ సోకినటువంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థలో, పాలన వ్యవస్థల్లో ఉన్నారు. అనేక చోట్ల ఇలాంటి వ్యక్తులు కూర్చొని చంద్రబాబు కుట్రలో భాగస్వాములు అవుతున్నారు.

వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ కుట్రపూరితమైన, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నారు. చంద్రబాబు కుట్రలను గమనించిన ఆయన సొంత సామాజిక వర్గ ప్రజలు మా నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారు. మరికొందరు నేతలు వైఎస్‌ జగన్‌కు బహిరంగంగా మద్దతు పలకడం శుభపరిణామం. కే వైరస్‌ పట్టిన వారిని, వ్యవస్థల్లో పని చేసే వారిని చంద్రబాబు వాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కోర్టుకు వెళ్తారు. శాసన సభ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు శాసన మండలిని వాడుకున్నారు. చదవండి: సామాజిక వర్గాలను అడ్డు పెట్టుకొని పెత్తనం ఏంటి?

ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడం. మీకు వచ్చిన నష్టం ఏంటి? కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను అడ్డుకొని ప్రజలను తీరని ద్రోహం చేశారు. వైఎస్‌ జగన్‌ సారధ్యంలో నీతి, నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ధీటైన నాయకులుగా ఎదుగుతున్నాం. మీరు మాత్రం అడ్డదారిలో వస్తున్నారు. మీడియాను అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు. ఎన్నికల్లో వైస్సార్సీపీ ఏకగ్రీవం కావడం చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారు. అందరిని మేనేజ్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. కే వైరస్‌ సోకిన అధికారుల సమూహాన్ని వాడుకొని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఇదేనా మీ నైజం' అంటూ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చదవండి: హింసా రాజకీయాలకు శ్రీరామ్‌ కుట్రలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top