రెచ్చిపోతున్న పచ్చపార్టీ నేతలు

TDP Leaders Assaulted On YSRCP Leaders - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌లో అధికార టీడీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు. పలుచోట్ల దౌర్జన్యాలు, దాడులకు దిగుతూ ప్రజలు, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్‌ జరగకుండా ప్రత్యర్థి అభ్యర్థులపై దాడులకు పాల్పడుతూ... హింస సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారు. పలు చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. 

  • గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు బీభత్సం సృష్టించారు. ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతున్న ఇనిమెట్లలో అల్లర్లు సృష్టించారు. 160 నెంబర్ పోలింగ్ బూత్‌లో గంటకు పైగా కూర్చొని ఉన్నారు. దీంతో కోడెలను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళకు దిగారు. ఓటర్ల తిరుగుబాటుతో కంగుతిన్న కోడెల.. సొమ్మసిల్లి పడిపోయినట్లు నటించారు. కోడెల తీరువల్ల పోలింగ్‌కు అంతరాయం కలుగుతుందని ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
  •  తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం నందంపుడిలో ఓ మహిళపై పోలీసు అధికారి దాడికి దిగారు. పోలింగ్‌ బూత్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న మహిళను కాళ్లతో తన్ని కిరాతంగా ప్రవర్తించారు. పిల్లలను బెదిరించి వాటర్‌ ప్యాకెట్లను నెలకేసి కొట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చినందుకే తనపై పోలీసులు దాడి చేశారని మహిళ ఆరోపించారు. 

     
  • అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సనీత వర్గీయులు భీభత్సం సృష్టించారు. సనపలో ఈవీఎంలు ధ్వంసం చేసి ఓటర్లపై బెదిరింపులకు దిగారు. సిద్ధరాంపురంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో ఐదుగురు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మరూరు గ్రామంలో మంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ ఓటర్లను బెదిరించారు. 

     
  • వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్పీ హుటాహుటిన జమ్మలమడుగు బయల్దేరి వెళ్లాడు. పొన్నతోటలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  జమ్మలమడుగులో అదనపు బలగాలను మొహరింపజేయాలని ఎస్పీకి వైఎస్సార్‌ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. 
     
  • గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నివాసపురంలో టీడీపీ పోలింగ్‌ ఏజెంట‍్లు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్‌పై దాడి చేశారు. బూత్‌ నంబర్‌ 100లోని వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌ను తీవ్రంగా కొట్టారు. అడ్డుకున్న అధికారును బెదిరిస్తూ పోలింగ్‌ కేంద్రంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతా అక్కడ తాత్కాలికంగా పోలింగ్‌ నిలిచిపోయింది. నరసరావు పేట మండలం యల్లమందలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో యల్లమందలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల దాడిపై గోపిరెడ్డి ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
     
  • విజయవాడ జక్కంపుడి వైఎస్‌ఆర్‌ కాలనీలో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. పోలింగ్‌ కేంద్రం వద్ద డబ్బులు పంచుతుండగా వైఎస్సార్‌ సీపీ కార‍్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ నేతలపై కొత్తపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

     
  • కర్నూలు జిల్లా అహోబిలంలో వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నేత గన్‌మెన్‌కు స్పల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. 
     
  • పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో చింతమనేని అనుచరుల బరి తెగించిపోయారు. బహిరంగంగా ఓటర్‌ స్లిప్పులతోపాటు డబ్బులను పంచుతున్నారు. ఓటుకు రూ. 1000 చొప్పున పోలింగ్‌ కేంద్రం సమీపంలో ఆటోలో కూర్చొని డబ్బులు పంచుతున్నారు. పోలింగ్‌ కేంద్రం సమీపంలో పోలీసులు లేకపోవడం గమనార్హం.
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top