వైఎస్సార్‌సీసీలోకి భారీగా చేరికలు | TDP Key Leaders From Jaggampeta Joins In YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీసీలోకి భారీగా చేరికలు

Dec 11 2019 5:11 PM | Updated on Dec 11 2019 6:55 PM

TDP Key Leaders From Jaggampeta Joins In YSRCP - Sakshi

సాక్షి, అమరావతి : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైఎస్సార్‌సీసీలో చేరారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమక్షంలో టీడీపీకి చెందిన నేతలు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్‌సీపీలో చేరినవారిలో టీడీపీ కీలక నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎనికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిస్తాయని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. విజయవాడలో 13 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులకు దొరికిందంటే అది స్పందన కార్యక్రమం వల్లనే అని గుర్తుచేశారు. సీఎం వైఎస్‌ జగగన్‌ ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement