అవినీతిని చూస్తూ ఊరుకోం | somu veerraju fires on govt | Sakshi
Sakshi News home page

అవినీతిని చూస్తూ ఊరుకోం

Oct 18 2017 1:12 AM | Updated on Oct 22 2018 8:57 PM

somu veerraju fires on govt - Sakshi

రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రం అడుగులు వేస్తే కచ్చితంగా ప్రశ్నిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో అవినీతిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వారికి మంత్రి పదవులు కట్టబెడుతున్నది తెలుగదేశం పార్టీయేనని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement